Alterson: 'నమో' యాప్ పై కలకలం రేపుతున్న ఫ్రెంచ్ హ్యాకర్ తాజా ట్వీట్లు!
- అమెరికా వెబ్ సైట్ కు సమాచారం
- యూరప్ జీడీపీఆర్ ప్రమాణాలను పాటించని యాప్
- గూగుల్ ప్లే ఒప్పందం కూడా ఉల్లంఘన
- ఆల్టర్ సన్ తాజా ట్వీట్లు
భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న 'నమో' యాప్ ప్రమాదకరమని గత వారంలో సంచలన ఆరోపణలు చేసిన ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ అల్డర్ సన్, తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెడుతూ, ఈ యాప్ యూజర్ల నుంచి అనుమతి తీసుకోకుండా వారి చిరునామాను అమెరికాకు చెందిన వెబ్ సైట్ కు అందిస్తోందని ఆరోపించారు. ఏపీఐ డాట్ నరేంద్ర మోదీ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ కు సమాచారం వెళుతోందని చెప్పారు.
ఈ యాప్ గూగుల్ ప్లే ప్రమాణాలను ఉల్లంఘిస్తోందని, యూరప్ రెగ్యులేటరీ జీడీపీఆర్ ప్రమాణాలను పాటించడం లేదని అన్నారు. యూజర్ అనుమతి లేకుండా సమాచారాన్ని తీసుకోరాదన్న నిబంధనలు ఉన్నా, ఈ యాప్ దాన్ని పాటించడం లేదని అన్నారు. గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని 'నమో' యాప్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. యాప్ పై ఇలియట్ అల్డర్ సన్ తాజా ట్వీట్లు కలకలం రేపుతున్నాయి.