Narendra Modi: 'కఠిన చర్యలు తీసుకోండి'.. సీబీఎస్ఈ 12, పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్‌పై ప్రధాని మోదీ స్పందన
- 10వ తరగతి గణిత శాస్త్రం, 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పేపర్ల లీక్
- కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడిన మోదీ
- కొనసాగుతోన్న దర్యాప్తు
సీబీఎస్ఈ 12, పదో తరగతి ప్రశ్న పత్రాలు లీకైన విషయం తెలిసిందే. 10వ తరగతి గణిత శాస్త్రం, 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పేపర్లకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటన కూడా చేసింది. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ ప్రశ్న పత్రాల లీకేజీ జరగడంతో ఆ ప్రభావం లక్షలాది మంది విద్యార్థులపై పడింది.