Twitter: సహృదయంతో నన్ను క్షమించండి: డేవిడ్ వార్నర్ వేడుకోలు

  • బాల్ ట్యాంపరింగ్ వివాదంలో డేవిడ్ వార్నర్
  • ఏడాది నిషేధం
  • సిడ్నీకి తిరిగి వెళుతూ క్షమాపణలు

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది నిషేధాన్ని అనుభవించనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, తప్పు చేసిన తనను సహృదయంతో క్షమించాలని వేడుకున్నాడు. ట్యాంపరింగ్ కుంభకోణంలో తెలిసో, తెలియకో తన పాత్ర కూడా ఉందని, అందుకు మన్నించమని కోరడానికి సిగ్గు పడటం లేదని చెప్పాడు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, "ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ మరియు ప్రపంచానికి... ప్రస్తుతం నేను సిడ్నీకి తిరిగి వెళుతున్నాను. నేను చేసిన తప్పులు క్రికెట్ ను డ్యామేజ్ చేశాయి. నా తరఫున తప్పున్నందుకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు కోరుతున్నాను. ఈ పని వల్ల క్రికెట్ అభిమానులు ఎంతగా బాధపడ్డారో నేను అర్థం చేసుకున్నాను.

నేను చిన్నప్పటి నుంచి ఆటను ఎంతో ప్రేమిస్తున్నాను. ఇప్పుడిక నా కుటుంబంతో, స్నేహితులతో నమ్మకమైన సలహాదారులతో సమయం గడుపుతాను. మరికొన్ని రోజుల్లో మళ్లీ కలుస్తాను" అంటూ పేర్కొన్నాడు. కాగా, వార్నర్ ను ఐపీఎల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ సైతం తప్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News