isro: 9 నెలల్లో 10 మిషన్లకు ప్రణాళిక: ఇస్రో ఛైర్మన్
- జీశాట్-6ఏ ప్రయోగం విజయవంతం
- ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు వినియోగం
- ఈ ఏడాది చంద్రయాన్-2 ప్రయోగం
ఇస్రో శాస్త్రవేత్తలు, కుటుంబ సభ్యులకు అభినందనలని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ అన్నారు. ఈ రోజు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6ఏ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ... ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తాము 9 నెలల్లో 10 మిషన్లకు ప్రణాళిక వేశామని, అలాగే ఈ ఏడాది చంద్రయాన్-2 ఉందని పేర్కొన్నారు. కాగా, జీశాట్-6ఏ.. మల్టీబీమ్ కవరేజ్ ద్వారా దేశ వ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్‌కు ఉపయోగపడనుంది.