China: పదంటే పది సెకన్లలో కుప్పకూలిన 15 అంతస్తుల భవంతి... వీడియో చూడండి!
- భవంతిని సురక్షితంగా నేలమట్టం చేసిన చైనా
- చుట్టూ ఉన్న భవనాలకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు
- వైరల్ అవుతున్న వీడియో
మౌలిక, భవన నిర్మాణ రంగంలో ఎంతగా అభివృద్ధి చెందామో, పాతబడిన భారీ భవంతులను సురక్షితంగా నేలమట్టం చేయడంలోనూ తాము నిష్ణాతులం అయ్యామని చైనా నిరూపించింది. కేవలం 10 సెకన్ల వ్యవధిలో 15 అంతస్తుల భవంతిని బాంబుల సాయంతో నేలమట్టం చేసింది.
చుట్టూ అంతే ఎత్తయిన భవనాలున్నా, వాటికి ఏ మాత్రం నష్టం కలుగకుండా జాగ్రత్తపడి విజయం సాధించింది. 'డైలీ మెయిల్' కథనం ప్రకారం, సౌత్ వెస్ట్ చైనా నగరం చెంగ్డూ ప్రాంతంలోని ఈ భవంతిని కూల్చి వేయాలని పోలీసులు నిర్ణయించుకోగా, అక్కడున్న వారందరినీ ఖాళీ చేయించారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన భవంతిని ప్రస్తుతం ఎగ్జిబిషన్ సెంటర్ గా వినియోగిస్తుండగా, డైనమైట్లను అమర్చి భవనాన్ని కూల్చి వేశారు. 150 అడుగుల ఎత్తున్న భవంతి కుప్పకూలిన వేళ, భారీ ఎత్తున పొగ, దుమ్ము, ధూళి ఆవరించాయి. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.