geetanjali: నా భర్తను పక్కన పెట్టేయడమే నన్ను బాధిస్తోంది: సీనియర్ నటి గీతాంజలి
- రామకృష్ణగారు పెద్ద హీరో
- ఆయన పేరున ఎలాంటి పురస్కారం లేదు
- పట్టించుకున్నవారూ లేరు
తెలుగు తెరపై కథానాయికగానేకాదు .. హాస్యంతో కూడిన పాత్రలను సైతం చేసి గీతాంజలి మెప్పించారు. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడిన ఆమె, ఒక విషయంలో ఆవేదనను వ్యక్తం చేశారు. " చిత్రపరిశ్రమలో పెద్దవాళ్లు ఉండగా పట్టించుకోరు .. పోయారనగానే పబ్లిసిటీ కోసం శ్రద్ధాంజలి జరుపుతారు. శోభన్ బాబుగారు చనిపోతే శ్రద్ధాంజలి చేస్తున్నారు. రామకృష్ణగారు చనిపోతే ఎవరైనా గుర్తుపెట్టుకుని శ్రద్ధాంజలి జరుపుతున్నారా?" అంటూ ఆమె ప్రశ్నించారు.
"ఎందుకు ఇలా తేడా చూపిస్తున్నారు? ఏం రామకృష్ణ పెద్ద నటుడు కాదా .. దాదాపు 250 సినిమాలు చేశారాయన. రామారావుగారి తరువాత కృష్ణుడు వేషం వేయాలంటే రామకృష్ణగారే . 'నోము' సినిమా నుంచి రామకృష్ణ టాప్ హీరో అయిపోయారు. అలాంటి ఆయన విషయంలో ఎందుకు గౌరవం చూపించలేకపోతున్నారు? కొంతమంది పేరు మీదుగా ఎంతో మందికి పురస్కారాలు ఇస్తున్నారు. రామకృష్ణగారి పేరు మీదుగా ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకని? నా భర్తని ఎందుకిలా పక్కన పెట్టేశారనేదే నన్ను బాగా బాధిస్తూ ఉంటుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.