Police: చికిత్స పేరుతో... యాసిడ్‌తో చిన్నారి ఛాతి, కాళ్లను కాల్చిన వైనం

  • రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌ జిల్లాలో ఘటన
  • చిన్నారిని మంత్రగత్తెవద్దకు తీసుకెళ్లిన తల్లి
  • మరింత క్షీణించిన పసివాడి ఆరోగ్యం
  • మంత్రగత్తె అరెస్టు

కంప్యూటర్ యుగంగా చెప్పుకుంటోన్న ఈ రోజుల్లోనూ ప్రజలు మూఢ నమ్మకాల బారి నుంచి బయటపడలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందుతున్నప్పటికీ.. అనారోగ్యంతో బాధపడుతోన్న కొందరు మంత్రగాళ్లనే ఆశ్రయిస్తుండడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌ జిల్లాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతోన్న ఒక నెల వయసున్న ప్రియాంషు అనే పసికందును అతడి తల్లి మంత్రగత్తె వద్దకు తీసుకెళ్లింది.

ఆమె పసివాడి జబ్బు తగ్గిస్తానంటూ అతడి ఛాతి, కాలి పాదాల మీద యాసిడ్ చల్లింది. దీంతో ఆ పసివాడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారి పరిస్థితిని గుర్తించిన వైద్యులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మంత్రగత్తెను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News