Andhra Pradesh: మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం!
- ఉపరితల ద్రోణి, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు
- ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలకు చాన్స్
- వడగళ్లు కూడా పడతాయన్న వాతావరణ శాఖ
ఏపీలో మరో రెండు మూడు రోజుల పాటు పిడుగులు, వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మూడో తేదీ వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల వడగళ్లకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
కాగా, నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు సహా, కరీంనగర్, వరంగల్, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అకస్నాత్తుగా వర్షాలు పడ్డాయి. ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందాయి. ఉపరితలద్రోణి, ఎల్ నినో ప్రభావం కారణంగానే వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.