google: గూగుల్ నుంచి ఇకపై ఈ సేవలు అందవు... goo.gl త్వరలో తెరమరుగు

  • ఏప్రిల్  13 నుంచి నిలిపివేత
  • ప్రస్తుత యూజర్లకు మరో ఏడాది పాటు అందుబాటులో
  • ఆ తర్వాత పూర్తిగా నిలిచిపోతాయి
  • ప్రకటించిన గూగుల్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పొట్టి యూఆర్ఎల్ (అసలు యూఆర్ఎల్ చిరునామాలకు బదులు కుదించిన చిన్న యూఆర్ఎల్) సేవలు goo.gl ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త యూజర్లు, గుర్తు తెలియని యూజర్లు ఇకపై  goo.gl లింక్ లను ఏప్రిల్ 13 తర్వాత క్రియేట్ చేసుకోవడం సాధ్యం కాదని గూగుల్ స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుత యూజర్లకు మాత్రం వెసులుబాటు కల్పించింది. మరో ఏడాది పాటు ఈ సేవలు పొందొచ్చని పేర్కొంది. ఆ తర్వాత వారికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.

‘‘గూగుల్ యూఆర్ఎల్ షార్టెనర్ ను 2009లో ప్రారంభించింది. యూఆర్ఎల్ లింకులను తేలిగ్గా షేర్ చేసుకునేందుకు, ఆన్ లైన్ ట్రాఫిక్ పెంచేందుకు ఇలా చేయడం జరిగింది. అయితే, నాటి నుంచి ప్రముఖ పొట్టి యూఆర్ఎల్ సేవలు చాలానే అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఇంటర్నెట్ లో కంటెంట్ పొందే తీరు కూడా మారిపోయింది. దీంతో  ఈ సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించాం’’ అని గూగుల్ తెలిపింది.

  • Loading...

More Telugu News