Ram Nath Kovind: సుప్రీం తీర్పుపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు జగన్ లేఖ!
- తన ఆదేశాలను సుప్రీంకోర్టు పున:సమీక్షించుకునేలా చేయండి
- సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉంది
- రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుంటోంది
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును మరోసారి సమీక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీలను అభద్రతాభావానికి గురి చేస్తాయని అన్నారు. భారత రాజ్యంగం కుల రహిత సమాజాన్ని కోరుకుంటోందని తెలిపారు. మరోవైపు, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇచ్చిన రూలింగ్ ను మరోసారి సమీక్షించాలని పిటిషన్ లో కోరింది.