Kamal Haasan: మోదీ తలచుకుంటే కావేరీ బోర్డు ఏర్పాటు చేయగలరు!: కమలహాసన్
- బోర్డు ఏర్పాటు చేయడం కష్టమైన పని కాదు
- ఈ విషయంలో మోదీని కలవాలనుకుంటున్నా
- ‘కావేరి’ వ్యవహారంపై అన్ని పార్టీలు ఏక తాటిపైకి రావాలి
ప్రధాని నరేంద్ర మోదీ తలచుకుంటే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయగలరని, ఇదేమంత కష్టమైన పని కాదని 'మక్కల్ నీతి మయ్యం' అధినేత కమలహాసన్ అన్నారు. చెన్నైలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు అంశం విషయమై మోదీని తాను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
‘కావేరి’ అంశానికి సంబంధించి వ్యక్తం చేసే నిరసనల్లో తమ పార్టీ గళం వినిపించాలని అనుకుంటున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా కమల్ చెప్పారు. ‘కావేరి’ వ్యవహారమై అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.