Pawan Kalyan: చంద్రబాబు నుంచి నాకు మళ్లీ పిలుపు వచ్చింది: విజయవాడలో పవన్ కల్యాణ్
- మళ్లీ అఖిలపక్ష సమావేశం జరుపుతారట
- కనీసం రెండేళ్ల క్రితం జరిపితే బాగుండేది
- అఖిలపక్ష మీటింగ్ వల్ల ఇప్పుడు ఏం లాభం?
- వెళ్లి కాఫీ, టీలు తాగి రావడమే జరుగుతుంది
కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో అఖిలపక్ష సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి నిన్న తనకు, తన పార్టీకి మళ్లీ లెటర్ అందిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు సంవత్సరాల క్రితం లేదంటే కనీసం ఒక ఏడాది క్రితం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు. అఖిలపక్ష మీటింగ్ వల్ల ఇప్పుడు ఏం లాభమో తనకు అర్థం కావడం లేదని, వెళ్లి కాఫీ, టీలు తాగి రావడం తప్ప ఏం చేస్తామని ప్రశ్నించారు.
కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు తమ మంత్రులతో కూర్చొని ప్రణాళిక వేసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయని, ఇక మున్ముందు పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనుకుంటున్నారో చంద్రబాబు స్పష్టత తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ తరువాత వారి మనసులో ఏముందో తమకు తెలియజేస్తే, వారు పోరాడాలనుకుంటోన్న విధానంపై తాము యోచించి, వారితో కలిసి పోరాడతామా? లేదా? అనే విషయంపై తాము చెబుతామని అన్నారు. కాగా, తాము జేఎఫ్సీ నివేదిక రూపొందించిన కారణంగానే టీడీపీ, వైసీపీలపై ఒత్తిడి పెరిగిందని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వరకు దారి తీసిందని పవన్ చెప్పుకొచ్చారు.