Nirav Modi: పీఎన్బీ కుంభకోణం .. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ
- సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నుంచి వారెంట్లు జారీ
- ఢిల్లీలో వెల్లడించిన ఉన్నతాధికారులు
- ఇంటర్ పోల్ కూడా స్పందించే అవకాశం?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. పీఎన్బీ కుంభకోణంలో విచారణ ఎదుర్కొనేందుకు భారత్ కు రాకుండా విదేశాల్లో గడుపుతున్న వీరిపై సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్టు ఉన్నతాధికారులు ఈరోజు తెలిపారు. కాగా, నీరవ్, మెహుల్ పై జారీ చేసిన మొదటి అరెస్టు వారెంట్ ఇది. కాగా, పీఎన్బీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ పలుమార్లు కోరినప్పటికీ వారు తిరస్కరించారు. తమకు వ్యాపారపరంగా ఉన్న ఎంగేజ్ మెంట్స్, ఆరోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేకపోతున్నామని నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ గతంలో తెలిపారు. సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేయడం ద్వారా ఇంటర్ పోల్ కూడా స్పందించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.