YSRCP: వైసీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

  • ఏపీ భవన్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలు
  • ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం
  • టీడీపీ చెబితే కాదు, మా అధినేత చెబితే రాజీనామా చేస్తా
  • ర్యాలీలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా ఏపీ భవన్ వద్ద వైసీపీ నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు  కొవ్వొత్తుల ర్యాలీ ఈరోజు నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఏపీకి చట్టబద్ధంగా రావాల్సిన ‘హోదా’ను కాదని ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడి ఏపీకి అన్యాయం చేశాయని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయాలంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ, తమ అధినేత ఆదేశిస్తే తప్పకుండా రాజీనామా చేస్తాను తప్ప, టీడీపీ చెబితే చేయనని అన్నారు.

  • Loading...

More Telugu News