India: సౌత్ ఇండియాపై ఉగ్రదాడికి ప్లాన్ చేసిన పాకిస్థాన్ దౌత్యాధికారి... ఫోటో విడుదల చేస్తూ ఆచూకీకై భారత్ అభ్యర్థన!

  • శ్రీలంకలో పనిచేసిన దౌత్యాధికారి అమీర్ జుబెయిర్
  • దక్షిణాదిలోని సైనిక, నౌకాదళ కేంద్రాలపై దాడికి ప్లాన్
  • ఆచూకీ తెలియాలని ఇంటర్ పోల్ ను కోరిన ఎన్ఐఏ

దక్షిణ భారత రాష్ట్రాలపై ఉగ్రదాడికి కుట్రపన్నిన ఆరోపణలతో పాకిస్థాన్ కు చెందిన దౌత్యాధికారిని వాంటెడ్ లిస్టులో పెట్టడంతో పాటు, అతని ఫోటోను విడుదల చేస్తూ, అతని గురించిన సమాచారం తెలిస్తే అందించాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) కోరింది. ఇండియా ఇలా పాక్ దౌత్యాధికారి ఫోటో, పేరు విడుదల చేస్తూ, సమాచారం కొరడం చరిత్రలో ఇదే తొలిసారి. కొలంబోలోని పాకిస్థాన్ హై కమిషన్ లో వీసా కౌన్సిలర్ గా పని చేసినర అమీర్ జుబెయిర్ సిద్ధిక్కీ, సౌత్ ఇండియాలోని సైనిక, నౌకాదళ కేంద్రాలపై దాడులకు కుట్ర పన్నారని ఆరోపించింది. అమీర్ తో పాటు మరో పాకిస్థాన్ అధికారికి కూడా ఈ కుట్రలో భాగం ఉందని ఎన్ఐఏ తెలిపింది. అమీర్ పై ఫిబ్రవరిలోనే చార్జ్ షీట్ ను దాఖలు చేసిన భారత్, అతని ఆచూకీ తెలియకపోవడంతో ఇంటర్ పోస్ సహా పలు దేశాలను ఆచూకీపై అభ్యర్థించింది. సిద్ధిక్కీతో పాటు వినీత్ అనే పేరుతో తిరిగిన పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారిని, 'బాస్ అలియాస్ షా' పేరుతో తిరిగిన మరో వ్యక్తిని కూడా వాంటెడ్ లిస్టులో పెట్టింది. వీరందరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News