wife: భార్య వస్తువు కాదు... ఆమెను తనతో ఉండమని బలవంతం చేస్తే చెల్లదు!
- ఆమె నీతో ఉండాలనుకోవడం లేదు
- మరి నీవు ఆమెతో ఎలా ఉండాలని ఎలా అంటావు?
- నిర్ణయంపై పునరాలోచనణ చేయాలని కోర్టు సూచన
‘‘భార్య అన్నది ఆస్తి కాదు లేదా వస్తువూ కాదు. తనతో కలసి ఉండమని బలవంతం చేస్తే చెల్లదు’’ అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేధిస్తున్న తన భర్తతో కలసి ఉండలేనంటూ ఓ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన భర్త తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా తాను మాత్రం అతనితో కలసి అడుగులు వేయలేనని ఆమె కోర్టుకు తెలిపింది. దీనిపై జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఆమె ఆస్తి కాదు. ఆమె నీతో కలసి జీవించాలనుకోవడం లేదు. రి ఆమెతో కలసి ఉండాలని ఎలా చెబుతావు?’’ అంటూ బాధితురాలి భర్తను ప్రశ్నలతో కడిగేసింది. ఆమె కలసి జీవించేందుకు ఇష్టంగా లేకపోవడంతో మరోసారి పునరాలోచించుకోవాలని కోర్టు సూచించింది. అయితే, ఆమెను ఒప్పించేందుకు అవకాశం ఇవ్వాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అదే సమయంలో విడాకులు ఇప్పించాలని బాధుతురాలి తరఫు న్యాయవాాది కోరారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్ట్ 8కి వాయిదా వేసింది.