allu arjun: 'నా పేరు సూర్య' ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్?
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0c8b3551e777a25cf409aa80d2b69308a1aa579d.jpg?format=auto)
- బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
- ఈ నెల చివర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్
- వచ్చేనెల 4వ తేదీన విడుదల
వచ్చేనెల 4వ తేదీన విడుదల కానుండటంతో, ఈ నెల చివరిలో 'నా పేరు సూర్య' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి కూడా బన్నీ .. ప్రభాస్ ల మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఆ కారణంగానే బన్నీ ఫంక్షన్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించాడని అంటున్నారు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. షూటింగుకి బ్రేక్ ఇచ్చి ప్రభాస్ వస్తాడేమో చూడాలి. ఇటీవల 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. యువకథానాయకుల మధ్య గల ఈ సఖ్యత అభిమానుల మధ్య ఐక్యతకు కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.