temple: ఇక్కడికి వచ్చేటప్పుడు స్కర్టులు, మినీ స్కర్టులు వేసుకురావద్దు.. ఆ గుడిలో రూల్‌

  • బెంగళూరులోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కొత్త రూల్
  • పురుషులయితే ధోతీ లేక ప్యాంటు వేసుకుని రావాలి
  • మహిళలు చీర లేక చుడీదార్‌లో రావాలి

బెంగళూరులోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కొత్త రూల్ పెట్టారు. దైవ దర్శనం కోసం వచ్చేవారు స్టైలుగా పాశ్చాత్య దుస్తులు వేసుకురాకూడదని, పురుషులయితే ధోతీ లేక ప్యాంటు వేసుకుని రావాలని, మహిళలు చీర లేక చుడీదార్ వేసుకుని రావాలని పేర్కొంది. స్కర్టులు, మినీ స్కర్టులు, మిడ్డీలు, స్లీవ్‌లెస్ టాప్‌లు వంటివి గుడికి వేసుకురావద్దంటూ నోటీస్‌ బోర్డులో రాసిపెట్టారు.

చక్కగా సంప్రదాయ దుస్తులు వేసుకుని రావాలని తేల్చి చెప్పారు. అయితే భక్తులు ‘డ్రెస్ కోడ్’ను తప్పనిసరిగా పాటించాల్సిందేనని మాత్రం గుడి సిబ్బంది చెప్పట్లేదు. అలాంటి దుస్తులు వేసుకుని వచ్చిన వారిని అడ్డుకోవట్లేదు. సంప్రదాయ దుస్తులు వేసుకోవాలని మాత్రమే చెబుతున్నామని, అలా కాకుండా వస్తే అడ్డుకోవడం వంటి పనులు చేయడం లేదని సిబ్బంది చెప్పారు.

  • Loading...

More Telugu News