inter: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల.. ఈ వెబ్సైట్లలో లభ్యం
- విడుదల చేసిన మంత్రి గంటా
- 84 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో కృష్ణా జిల్లా
- ఎంపీసీలో 992 మార్కులతో అగ్రస్థానంలో తేజ వర్ధనరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి గత నెలలో ప్రయోగ, థియరీ, జనరల్, ఒకేషనల్ కోర్సులకు నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు రాజమహేంద్ర వరం నుంచి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 77 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నెల్లూరు జిల్లా, 76 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో గుంటూరు జిల్లా నిలిచాయి.
ఇక 59 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో కడప జిల్లా నిలిచింది. ఈ సారి రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేస్తున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 44 వెబ్సైట్లలో ఫలితాలు లభ్యమవుతాయని చెప్పారు. కాగా, ఎంపీసీలో 992 మార్కులతో మొదటి స్థానంలో విద్యార్థి కూనం తేజ వర్ధనరెడ్డి నిలవగా, రెండో స్థానంలో 991 మార్కులతో ఆఫ్రాన్ షేక్, మూడో స్థానంలో 990 మార్కులతో వాయలపల్లి సుష్మ నిలిచారు. బైపీసీలో మొదటి స్థానంలో ముక్కు దీక్షిత (990), రెండో స్థానంలో నారపనేని లక్ష్మీ కీర్తి (990), మూడో స్థానంలో కురుబ షిన్యత (990) నిలిచారు.
ఎంఈసీలో మొదటి స్థానంలో నిశాంత్ కృష్ణ (982), ఎంఈసీలో రెండో స్థానంలో మీనా (981), మూడో స్థానంలో గుడివాడ నాగ వెంకట అభిషేక్ (981) నిలిచారు. సీఈసీలో మొదటి స్థానంలో కాదంబరి గీత (968), రెండో స్థానంలో సెల్వ రాజ్ ప్రియ (966), మూడో స్థానంలో కాస శ్రీరామ్ (964) ఉన్నారు. హెచ్ఈసీలో మొదటి స్థానంలో గీత (966), రెండో స్థానంలో లావణ్య (952), మూడో స్థానంలో సత్య నారాయణ (949) నిలిచారు.
ఈ కింది వెబ్సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు...