CM Ramesh: ఏ1, ఏ2లు పోటా పోటీగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు: ఎంపీ సీఎం రమేశ్
- దీక్షకు సిద్ధమైన చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారు
- జరిగిన అన్యాయంపై మోదీని వైసీపీ విమర్శించట్లేదు
- ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉండటం రాష్ట్రానికే అమర్యాద
- జగన్‌ను 420కి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవచ్చు
ఈ నెల 20న దీక్షకు సిద్ధమైన తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తోన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏ1, ఏ2 నేరగాళ్లు పోటా పోటీగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసిన ప్రధానమంత్రి మోదీ సర్కారుని వారు ఎందుకు విమర్శించట్లేదని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తుంటే ఇలా విమర్శలు చేయడం సరికాదని, ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉండటం రాష్ట్రానికే అమర్యాదగా ఉంటోందని, ఆయనను 'సెక్షన్ 420'కి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవచ్చని రమేశ్ ఎద్దేవా చేశారు.