drugs: బెంగళూరు విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన మత్తు పదార్థాలు
- 12.9 కిలోల మెథాక్యులోన్ స్వాధీనం
- దీని విలువ రూ.6.5 కోట్లు
- పార్శిల్ ద్వారా మలేషియాకు రవాణా చేసే యత్నం
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు (డ్రగ్స్) వెలుగు చూశాయి. 12.9 కిలోల మెథాక్యులోన్ అనే డ్రగ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.6.5 కోట్లు ఉంటుందని అంచనా. మెదడుపై ప్రభావం చూపించే ఈ డ్రగ్ ను ‘నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985’ కింద నిషేధించడం జరిగింది. నిన్న రాత్రి చెన్నై నుంచి మలేషియాకు ఓ కొరియర్ సంస్ధ ద్వారా వెళుతున్న పార్సిల్ ను అధికారులు అనుమానించి తెరిచి చూడడంతో మత్తు పదార్థాలు బయటపడ్డాయి.