kathuva: కథువా కేసులో వాళ్లే అసలైన నిందితులు.. నిజాన్ని నిగ్గు తేల్చిన డీఎన్ఏ రిపోర్ట్!
- యోని ద్రవాలపై నిర్వహించిన డీఎన్ఏ పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్
- ఫ్రాక్ పై నున్న రక్తపు మరకల డీఎన్ఏ రిపోర్ట్ కూడా నిర్ధారణ
- ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ను పోలీసులకు అందజేసిన నిపుణులు
నిర్భయ ఘటన తరువాత దేశవ్యాప్తంగా కలకలం రేపిన కథువా హత్యాచార ఘటనలో ల్యాబ్ పరీక్షల వివరాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో నిందితులను తేల్చేందుకు ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ 14 పరీక్షలను నిర్వహించింది. వెజైనల్ స్వాబ్స్, హెయిర్ స్ట్రాండ్స్, నలుగురు నిందితుల బ్లడ్ శ్యాంపిళ్లతో పాటు మృతురాలి విస్రా, బాలిక ఫ్రాక్, సల్వార్, అక్కడున్న మట్టి, రక్తపు మరకలను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు.
శ్యాంపిళ్లను పరీక్షించిన తరువాత నిందితులే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ల్యాబ్ తేల్చింది. యోని ద్రవాలపై నిర్వహించిన పరీక్షలో డీఎన్ఏ శాంపిళ్లు కూడా మ్యాచ్ అయినట్టు రిపోర్ట్ వెల్లడించింది. దీంతో నార్కో టెస్టుకు సిద్ధమంటూ నిందితులు చేసిన వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేందుకేనని నిర్ధారణ అయింది. ఈ నివేదికను జమ్మూకశ్మీర్ క్రైం పోలీసులకు అందజేసినట్లు ల్యాబ్ తెలిపింది.