Madhya Pradesh: 15 ఏళ్ల గిరిజన బాలికను లక్షా పాతిక వేలకు విక్రయించిన మేనమామ!
- గిరిజన బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి వేధింపులు
- పోలీసులను ఆశ్రయించిన బాలిక
- కఠిన చర్యలకు ఆదేశించిన హోం మంత్రి
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తరువాత రక్షణగా నిలవాల్సిన మేనమామ 15 ఏళ్ల మైనర్ బాలికను కాసులకు కక్కుర్తిపడి విక్రయించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని సెహోర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికను ఆమె మేనమామ.. లక్షా ఇరవై ఐదు వేల రూపాయలకు విక్రయించాడు.
ఆ తరువాత బాలికను కొనుక్కున్న వ్యక్తి, ఆమెను వేధించడంతో సదరు బాలిక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై నిజానిజాలను వెలికితీసి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ ఆదేశించారు. దీంతో ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.