Pawan Kalyan: ‘బొంబాయిలో అంతే..బొంబాయిలో అంతే’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్

  • ఆ పదాలు పల్లెటూళ్లలో సాధారణంగా వినపడుతుంటాయట
  • ఆ మాట ‘బూతురత్నం’ చెబుతున్నాడు
  • మరి, ‘బూతురత్నం’ ను అలా పిలిస్తే తప్పుగా అనుకోడుగా?

తన తల్లిని ఏ పదాలతో అయితే దూషించారో, ఆ పదాలు పల్లెటూళ్లలో సర్వసాధారణంగా వినపడుతూ ఉంటాయని ‘బూతురత్నం’ అంటున్నాడని, మరి, ఈ లాజిక్ ను ఆధారంగా చేసుకుని, ఆ ‘బూతురత్నం’ను అలా పిలిచినా తప్పుగా అనుకోడంటూ పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓ ట్వీట్ చేశారు. పంతొమ్మిదేళ్ల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రౌడీ అల్లుడు' చిత్రంలో అల్లు రామలింగయ్య చెప్పే ‘బొంబాయిలో అంతే, బొంబాయిలో అంతే’ డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఈ డైలాగ్ ను ఆధారంగా చేసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆ ట్వీట్ చేయడం గమనార్హం. 

  • Loading...

More Telugu News