stock markets: బ్యాంకింగ్, ఆటో అండతో లాభాలతో ముగిసిన మార్కెట్లు
- ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు
- 166 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 30 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూలతలతో మన మార్కెట్లు నేడు లాభాల బాటపట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, రిఫైనరీ సూచీలు లాభపడ్డాయి. ఉదయం నుంచి కూడా మార్కెట్లలో లాభాల జోరు కొనసాగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 34,617కి పెరిగింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 10,614కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
గాటి లిమిటెడ్ (19.98%), ఆస్ట్రా మైక్రోవేవ్ (11.80%), ఇండియాబుల్స్ వెంచర్స్ (9.99%), గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (7.21%), జీఎంఆర్ ఇన్ఫ్రా (6.62%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (-13.33%), కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (-10.95%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-10.47%), హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ (-7.55%), నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (-7.54%).