sonam kapoor: నా పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టను .. సింపుల్ గా ఇంట్లోనే!: సోనమ్ కపూర్
- ఆనంద్ ఆహూజాతో ప్రేమలో పడిన సోనమ్ కపూర్
- పెళ్లికి రెండు కుటుంబాలవారి అంగీకారం
- సింపుల్ గా పెళ్లి జరుగుతుందన్న సోనమ్
బాలీవుడ్ తెరపై మెరుపుతీగలా కనిపిస్తూ యూత్ హృదయాలను కొల్లగొట్టేసిన సోనమ్ కపూర్, ఈ మధ్య ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో ప్రేమలో పడినట్టుగా వార్తలు షికారు చేశాయి. వీరి పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
అయితే వీరి వివాహం అత్యంత వైభవంగా ముంబైలో గానీ .. స్విట్జర్లాండ్లో గాని జరగనుందనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదంటూ, తాజాగా ఈ విషయంపై సోనమ్ కపూర్ స్పందించారు. నా పెళ్లికి నేను లక్షల ఖర్చు చేయదలచుకోలేదు .. అంత అవసరం లేదు కూడా. అవసరమైతే నా పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటే అయ్యే ఖర్చును విరాళంగా ఇస్తాను. నాకు నచ్చినట్టుగా నా పెళ్లిని నేను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో .. పద్ధతిగా చేసుకుంటాను అన్నారు.