xioami: భారత స్మార్ట్ ఫోన్ రారాజు షియోమీనే... 31 శాతానికి చేరిన మార్కెట్ వాటా
- జనవరి-మార్చి కాలంలో 31 శాతానికి చేరిన వాటా
- 26.2 శాతం వాటాతో రెండో స్థానంలో శాంసంగ్
- ఆ తర్వాత వివో, ఒప్పోలు
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనాకు చెందిన షియోమీ తన హవా కొనసాగిస్తోంది. దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో ఈ సంస్థ వాటా 31.1 శాతానికి చేరిందని హాంగ్ కాంగ్ కు చెందిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. సింగపూర్ కు చెందిన క్యానలిస్ సైతం షియోమీ వాటా 31 శాతానికి చేరినట్టు వెల్లడించింది.
శామ్ సంగ్ ఒకప్పుడు భారత మార్కెట్ ను ఏలగా, ఇప్పుడు షియోమీ ధాటికి రెండో స్థానానికి దిగజారింది. ఈ సంస్థ వాటా 26.2 శాతంగా ఉంది. ఆ తర్వాత వివో 5.8 శాతం వాాటాతో మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది షియోమీ రెడ్ మీ5, 5ఏ, నోట్ 5 తదితర మోడళ్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వివో తర్వాతి స్థానంలో ఒప్పో ఉంది. ఇక చైనాకు చెందిన లెనోవో, జియోనీ బ్రాండ్లు మాత్రం గణనీయ స్థాయిలో వాటాను కోల్పోయాయి.