asaram babu: ఆశారాం బాపు ఆధ్యాత్మిక గురు కాకముందు... ఏం చేసేవాడో తెలుసా?
- ఆశారాం కుటుంబం పాకిస్థాన్ లోని సింధీ ప్రాతం నుంచి వలస వచ్చింది
- చిన్న వయసులో గుర్రపు బగ్గీ తోలిన ఆశారాం
- ఆ తర్వాత మత బోధనలు చేస్తూ, ఆశ్రమాలు నెలకొల్పాడు
బాలికపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపును జోధ్ పూర్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. కాసేపట్లో ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది. ఆశారాం బాపు అసలు పేరు అసుమల్ అని అజ్మీర్ వాసులు చెబుతున్నారు. వీరి కుటుంబం దేశ విభజనకు ముందు ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధీ ప్రాంతం నుంచి వలస వచ్చింది. తొలుత గుజరాత్ లో సెటిల్ అయింది.
అక్కడి నుంచి అజ్మీర్ కు ఆశారాంబాపు వలస వచ్చాడని సీనియర్ లాయర్ చరణ్ జిత్ సింగ్ తెలిపారు. ఆశారం చిన్నప్పుడు గుర్రపుబగ్గీ నడిపేవాడని టాంగా యూనియన్ సభ్యుడు పన్నాఉస్తాద్ వెల్లడించాడు. అజ్మీర్ రైల్వే స్టేషన్ నుంచి దర్గాకు భక్తులను తీసుకొచ్చేవాడని తెలిపాడు. తన పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు గుర్రపుబగ్గీ నడుపుతూ, కష్టపడేవాడని చెప్పాడు ఆ తర్వాత గురువుగా మారి, దైవ బోధనలు చేస్తూ ఆశ్రమాలు నెలకొల్పాడని తెలిపాడు.