pruthvi: వేషం అడిగితే.. భోజనం పెట్టి 50 రూపాయలు ఇస్తామన్నారు: కమెడియన్ పృథ్వీ
- అది నేను ఊరి నుంచి వచ్చిన కొత్త
- ఆ డైరెక్టర్ నా ముఖం చూడటానికి ఇష్టపడలేదు
- నేను అలా అనాల్సి వచ్చింది
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ .. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా షూటింగ్ సమయంలో తనకి ఎదురైన ఓ అవమానాన్ని గురించి ఇలా చెప్పుకొచ్చారు. " అది నేను ఊరు నుంచి వచ్చిన కొత్త .. అదో రకం జోష్ ఉండేది. డైరెక్టర్ గారు కూర్చుని వున్నారు .. నేను వెళ్లి వేషం అడిగాను.
'ప్రతి ఒక్కడూ ఇండస్ట్రీకి వచ్చి కేరక్టర్లు అడిగేవాడే' అన్నారు. ఆయన నా ముఖం చూడటానికైనా ఇష్టపడలేదు. అయినా 'ఏదో ఒక వేషం ఇవ్వండి సార్ .. వెనకాలైనా నిలబెడతాను' అన్నాను. 'ఏం చదువుకున్నావ్' అని అడిగారు .. 'ఎం.ఏ' చదివాను సార్' అని చెప్పాను. 'భోజనం పెట్టి 50 ఇస్తాం' అన్నారు. అడ్డా మీద కూలీలను దృష్టిలో పెట్టుకుని ఆయన అలా మాట్లాడాడనుకుని, 'మీ రిచ్చే 50 నాకు అవసరం లేదు సార్ .. మా పాలేరుకే రోజుకి 100 రూపాయలు ఇస్తాం' అన్నానంటూ చెప్పుకొచ్చారు.