akhila priya: చంద్రబాబుతో భేటీ కోసం అమరావతి చేరుకున్న ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్లగడ్డలోనే ఉండిపోయిన అఖిల ప్రియ
- ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై టీడీపీ అధిష్ఠానం భేటీ
- తనకు సమాచారం అందలేదని చెప్పిన అఖిలప్రియ
- నిన్న కూడా భేటీకి హాజరు కాని ఏపీ మంత్రి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై కొంతమంది రాళ్లదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఏపీ మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రమ్మన్నారు. దీంతో ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి అమరావతి చేరుకున్నారు. ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం అందలేదని మంత్రి అఖిల ప్రియ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు.
కాగా, ఈ భేటీ నిన్న నిర్వహించాలని చూడగా.. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ నిన్న చెప్పిన విషయం తెలిసిందే.