gold: పెరిగిన బంగారం, వెండి ధరలు
- 10గ్రా.ల బంగారం ధర రూ.225 పెరిగి రూ.32,450గా నమోదు
- కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.40,700
- పెళ్లిళ్ల సీజన్ కారణంగా ధరలు పెరుగుదల
బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.225 పెరగడంతో రూ.32,450కి చేరింది. స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా పరిస్థితుల కారణంగా ఈ రోజు బంగారం ధర పెరిగిందని విశ్లేషకులు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్లు తెలిపారు.
మరోవైపు, కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.40,700కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికమవడంతో వెండి ధర పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో పసిడిధర 0.38 శాతం తగ్గి ఔన్సు ధర 1.324.70 డాలర్లుగా నమోదయింది.