narasimhan: చంద్రబాబుకి గవర్నర్ నరసింహన్ ఫోన్.. విశాఖ, శ్రీకాకుళం పరిస్థితులపై సూచనలు
- తీర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు
- వివరాలు తెలుసుకున్న గవర్నర్
- ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలన్న నరసింహన్
- నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని సూచన
విశాఖ తీరంలో కెరటాలు విరుచుకుపడుతున్నాయని, తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. శ్రీకాకుళ సముద్ర తీర ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయంపై కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గవర్నర్ నరసింహన్ ఫోన్ చేశారు.
విశాఖపట్నం, శ్రీకాకుళంలోని సముద్ర తీర ప్రాంత పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. తీర ప్రాంతంలో విపరీత వాతావరణ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. నిత్యావసర వస్తువులు, సహాయక బృందాలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.