Rajasthan: ఈరోజు దేశంలోనే అత్యధికంగా గంగానగర్లో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
- ఏపీలోని కర్నూలులో 43 డిగ్రీల సెల్సియస్
- రెంటచింతలలో 42.3
- విజయవాడ, అమరావతి, కడపలో 42
ఈ రోజు ఎండల తీవ్రత మరింత పెరిగింది. నేడు దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్లోని గంగానగర్లో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఏపీలోని కర్నూలులో 43 డిగ్రీలు నమోదైంది. మహారాష్ట్రలోని విదర్భ మీదుగా వీస్తోన్న వడగాల్పుల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. దేశంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రత తీవ్రత 40 డిగ్రీలకు చేరువగా ఉంది.
ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వివరాలు..
- రెంటచింతలలో 42.3 డిగ్రీల సెల్సియస్
- విజయవాడ, అమరావతి, కడపలో 42
- గుంటూరు, తిరుపతి, నెల్లూరు, మాచర్లలో 41
- అనంతపురం, రాజమహేంద్రవరం, ఏలూరు, నరసరావుపేటలో 40
- విజయనగరంలో 39
- ఒంగోలు, శ్రీకాకుళం, కాకినాడలో 38, విశాఖపట్నంలో 37