teja: తేజ చేతిలో ఇప్పుడు ఆ రెండు సినిమాలూ లేవు!
- వెంకీతో మూవీ చేయాల్సిన తేజ
- 'ఎన్టీఆర్' దర్శకుడు ఆయనే
- ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులకు దూరం
రానా హీరోగా తేజ తెరకెక్కించిన 'నేనే రాజు నేనే మంత్రి' భారీ హిట్ కావడంతో, ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని వెంకటేశ్ ఉత్సాహాన్ని చూపించారు. ఈ సినిమాకి 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.
అయితే, కారణాలేమిటనే సంగతి తెలియదుగానీ, చివరి నిమిషంలో వెంకటేశ్ వెనక్కి తగ్గారు. అందువలన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక బాలకృష్ణతో 'ఎన్టీఆర్' సినిమాను కూడా ఆయన సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి వుంది. కానీ ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకుంటున్నట్టు తేజ స్వయంగా ప్రకటించారు. చాలాకాలం తరువాత తేజ వెంటవెంటనే రెండు సినిమాలు చేస్తున్నాడని అనుకుంటే, ఆ రెండు ప్రాజెక్టులకు ఆయన దూరం కావడం చర్చనీయాంశమైంది.