eranki sharma: ఈరంకి శర్మ మరణం నన్నెంతగానో బాధించింది: చిరంజీవి
- సీనియర్ దర్శకులుగా ఈరంకి శర్మ
- రజనీ .. చిరూలతోను సినిమాలు
- కథాబలానికే ప్రాధాన్యత
తెలుగు తెరపై కథాబలమున్న చిత్రాలను ఆవిష్కరించి, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించిన సీనియర్ దర్శకులలో ఈరంకి శర్మ(85) ఒకరు. సినిమాల పట్ల గల ఆసక్తి కారణంగా ఎడిటర్ గా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన, ఆ తరువాత బాలచందర్ వంటి దర్శక దిగ్గజాల దగ్గర అసిస్టెంట్ డైరైక్టర్ గా .. అసోసియేట్ డైరెక్టర్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకి పనిచేశారు.
రజనీకాంత్ తో 'చిలకమ్మ చెప్పింది' .. చిరంజీవితో 'కుక్కకాటుకు చెప్పు దెబ్బ'తో పాటు ఓ 15 విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారు. గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, నిన్న మరణించారు. ఈ సందర్భంగా అమెరికాలో వున్న చిరంజీవి ఫోన్ సందేశం ద్వారా ఈరంకి శర్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. "ఒక నెల రోజుల క్రితమే ఆయన ఫోన్ చేసి తన మనవరాలి పెళ్లికి రమ్మని ఆహ్వానించారు. అలాంటి ఆయన ఇలా దూరం కావడం నా మనసుకు చాలా బాధ కలిగించింది" అని చిరంజీవి ఆవేదనను వ్యక్తం చేశారు.