daimond: డైరెక్టర్ గా మారుతోన్న మరో రైటర్!

  • దర్శకులుగా మారుతోన్న రచయితలు
  • సక్సెస్ అయిన త్రివిక్రమ్ .. కొరటాల 
  • ఆ దారిలో మరికొందరు రచయితలు

త్రివిక్రమ్ .. కొరటాల రచయితలుగా తమ సత్తాను చాటుకుని, ఆ తరువాత మెగాఫోన్ చేతబట్టారు. దర్శకులుగాను వీరు ఘన విజయాలను అందుకుంటూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మరో స్టార్ రైటర్ .. డైరెక్టర్ గా మారుతున్నాడు. ఆ రైటర్ పేరే .. డైమండ్ రత్నబాబు. ఎక్కువగా హాస్య చిత్రాలకి రచయితగా పనిచేసిన ఆయన, మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక దర్శకుడిగానూ మారాలనే ఆసక్తితో, ఒక సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఒక యంగ్ హీరో ఈ సినిమాలో కథానాయకుడిగా నటించనున్నాడు. గతంలో 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమాను నిర్మించిన అంజిరెడ్డి .. ఓంకార్ అవుట్ డోర్ యూనిట్ వారు కలసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.   

  • Loading...

More Telugu News