kota srinivas rao: ఆ భయం కారణంగానే నేను సినిమాల్లో ప్రయత్నించేవాడిని కాదు: కోట శ్రీనివాసరావు
- నాటకాల్లో నటించేవాడిని
- సినిమాల పట్ల ఆసక్తి ఉండేది
- ట్రై చేయాలంటే అభద్రతా భావం
తెలుగు తెరపై విభిన్నమైన విలనిజాన్ని పండించిన కోట శ్రీనివాసరావు, ఆలోచింపజేసే పాత్రలను .. ఆవేదనతో గుండె బరువెక్కే పాత్రలను పోషించి మెప్పించారు. అలాంటి కోట శ్రీనివాసరావు తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు.
"సినిమాల్లోకి వెళ్లాలని ఉన్నప్పటికీ అభద్రతాభావం వుండేది .. అందువలన ఒక వైపున ఉద్యోగం చేసుకుంటూనే, మరో వైపున నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూ వుండేవాడిని. అప్పట్లో సినిమా ఆర్టిస్టు అంటే ఎత్తుగా .. అందుకు తగిన పర్సనాలిటీతో మంచి రంగుతో వుండాలని అనేవాళ్లు .. నేనేమో నల్లగా ఉండేవాడినాయే. సినిమాల్లో ట్రై చేస్తే 'నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?" అని ఎవరైనా అంటారేమోనని భయం. అందువల్లనే ఎప్పుడూ ట్రై చేసేవాడిని కాదు" అంటూ చెప్పుకొచ్చారు.