kota srinivas rao: నా పైన అనవసరంగా ఆ నింద వేశారు: కోట శ్రీనివాసరావు
- పరభాషా నటులను తీసుకోవద్దని అనలేదు
- టాలెంటు వున్న వాళ్లను తీసుకోమన్నాను
- అది కాస్త అలా ప్రచారం చేసేశారు
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడారు. "చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాలలో తెలుగువారికి అవకాశాలు తగ్గుతుండటం గురించి ఏం చెప్తారు?" అనే ప్రశ్నకి ఆయన తనదైన శైలిలో స్పందించారు. "తెలుగు సినిమాల్లో తెలుగువారికి అవకాశాలు తగ్గుతుండటం పట్ల నేను చాలా సంవత్సరాల క్రితమే అసంతృప్తిని వ్యక్తం చేశాను. అవకాశాల విషయంలో దర్శక నిర్మాతలు చేస్తున్నది తప్పే"
"ఈ మాట నేను అన్నందుకు నా గురించి చెడుగా ప్రచారం చేశారు. పరభాషా నటులంటే కోట శ్రీనివాసరావుకు పడదు .. పరభాషా నటులు వద్దు వద్దు అంటూ ఆయన గొడవ చేస్తుంటారు అంటూ నాపై నింద వేశారు. నేను ఎప్పుడూ అలా పరభాషా నటులు వద్దని అనలేదు .. టాలెంటు వున్న వాళ్లను తీసుకురండి అని మాత్రమే చెప్పాను. నసీరుద్దీన్ షా .. నానా పటేకర్ లాంటి వాళ్లను తీసుకు రమ్మనండి .. నేను వాళ్ల దగ్గర నౌకరు వేషం వేయడానికి కూడా సిద్ధమే" అని చెప్పుకొచ్చారు.