Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ప్రియుడితో నయనతార ప్రేమయాత్ర 
  • విలన్ గా మారుతున్న రాజశేఖర్ 
  • నాగార్జునతో తేజ ప్రాజక్ట్

*  తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నిండా ప్రేమలో మునిగిపోయిన కథానాయిక నయనతార, ప్రస్తుతం ప్రియుడితో కలసి ప్రేమయాత్ర చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరూ కలసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
*  ఇటీవల 'గరుడవేగ' చిత్రంతో హిట్ కొట్టిన సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు తన రూటు మారుస్తున్నాడు. యంగ్ హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో విలన్ గా కీలక పాత్ర పోషించడానికి ఓకే చెప్పాడట.
*  ఇటీవల 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి తప్పుకున్న ప్రముఖ దర్శకుడు తేజ తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జునకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు సమాచారం.   

  • Loading...

More Telugu News