sensex: అమెరికా-చైనా చర్చల నేపథ్యం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
- 73 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 10,680కి పడిపోయిన నిఫ్టీ
- 12.28 శాతం పతనమైన జెట్ ఎయిర్ వేస్
నిన్న ఫ్లాట్ గా ముగిసిన భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంతో పాటు, అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 73 పాయింట్లు కోల్పోయి 35,103కు పడిపోయింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 10,680కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
క్వాలిటీ (9.78%), పీసీ జువెలర్స్ (9.76%), ఎంఎంటీసీ లిమిటెడ్ (8.69%), రెయిన్ ఇండస్ట్రీస్ (4.77%), మణప్పురం ఫైనాన్స్ (4.67%).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్స్ (-24.84%), జెట్ ఎయిర్ వేస్ (-12.28%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (-10.57%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-7.49%), హెచ్డీఐఎల్ (-6.45%).