dachepally: సుబ్బయ్య పోస్టు మార్టం పూర్తి.. మృతదేహాన్ని తీసుకోబోమన్న బంధువులు!
- అత్యాచార ఘటన నిందితుడి ఆత్మహత్య
- గురజాల ప్రభుత్వాసుపత్రిలో సుబ్బయ్య మృతదేహం
- పంచాయతీకి అప్పగించే అవకాశం
గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో 9 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వైద్యులు శవపరీక్ష పూర్తి చేశారు. అయితే, అనంతరం ఆ మృతదేహాన్ని సుబ్బయ్య కుటుంబ సభ్యులకు అప్పగించాలని చూడగా.. తీసుకెళ్లేందుకు వారు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని పంచాయతీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.