instagram: ఇన్ స్టా గ్రామ్ లో కొత్తగా చేరిన పేమెంట్స్ ఫీచర్
- డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు
- క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రొపైల్ కు యాడ్ చేసుకోవాలి
- ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంత మందికే పరిమితం
ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ తన ప్లాట్ ఫామ్ కు పేమెంట్స్ ఫీచర్ ను జత చేసింది. అంటే ఇన్ స్టా గ్రామ్ యూజర్లు యాప్ నుంచే ఇతరులకు డబ్బు చెల్లింపులు చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందరికీ కాకుండా కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగిలిన వారికి కూడా అందుబాటులోకి వస్తుంది. తమ ప్రొఫైల్ కు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యాడ్ చేసి పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. ఈ పిన్ ఆధారంగా కావాల్సిన వారికి చెల్లింపులు చేసుకోవచ్చు. ఒకటికి మించిన సేవలకు అనువుగా మార్చడం ద్వారా యూజర్లను నిలుపుకునే ప్రయత్నాలేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫొటో షేరింగ్ యాప్ అయిన ఇన్ స్టా గ్రామ్ ఇక చెల్లింపుల సాధనంగానూ ఉపయోగపడనుంది.