YSRCP: రోజా ఒక బరితెగించిన మహిళ: యరపతినేని
- రోజాను మహిళ అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది
- చంద్రబాబు, ప్రభుత్వం గురించి ఆమె మాట్లాడటం సిగ్గుచేటు
- దాచేపల్లి సంఘటనలో ముందుగా బాధిత బాలికకు మానసిక స్థైర్యం ఇవ్వాలి
దాచేపల్లి ఘటన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మహిళా మంత్రులు, పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రోజాను మహిళ అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఆమె ఒక బరితెగించిన మహిళ. ఒక శాసనసభ్యురాలై ఉండి.. అసెంబ్లీ సాక్షిగా ‘నన్ను దమ్ముంటే రేప్ చేయండి’ అని మాట్లాడిన వ్యక్తి రోజా. అటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య వైసీపీకి చెందిన వ్యక్తి. ప్రతిపక్షంలో ఉండి అకృత్యాలకు పాల్పడటం, అత్యాచారాలు చేయడమే కాకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం దారుణం. వైసీపీకి గానీ, రోజాకు గానీ ఏ సంఘటన గురించి మాట్లాడే హక్కు లేదు. దాచేపల్లి సంఘటనలో ముందుగా బాధిత బాలికకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. ఆ బాలిక భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూడాలని మానవత్వంతో ప్రభుత్వం ఆలోచించింది’ అని చెప్పుకొచ్చారు.