nani: ఆడపిల్లల అపహరణ నేపథ్యంతో 'అమోలి' .. .. నాని వాయిస్ ఓవర్
- ఆడపిల్లల అపహరణలు
- వాళ్ల కన్నీటి కథలు
- చీకట్లో కలిసిపోతోన్న జీవితాలు
ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది' అనే మాట బలంగా వినిపిస్తోంది. ఆడపిల్లలు అపహరణకు గురికావడం .. అఘాయిత్యాలకి బలవుతుండటం రోజురోజుకి పెరిగిపోతోంది. అపహరణకు గురైన ఆడపిల్లలంతా ఏమైపోతున్నారు? ఎలాంటి పరిస్థితులను వాళ్లు ఎదుర్కుంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధాన రూపంగా 'అమోలి' అనే లఘు చిత్రం రూపొందింది.
'అమోలి'కి ట్యాగ్ లైన్ గా 'వెలకట్టలేనిది' కనిపిస్తోంది. 28 నిమిషాల నిడివి కలిగిన ఈ లఘు చిత్రం .. మనసును ఆవేదనా భరితం చేస్తుంది. ఆడపిల్లలు అమ్మివేయబడుతోన్న సంఘటనలు .. తాము అనుభవిస్తున్న కన్నీటి జీవితం పట్ల వాళ్ల స్పందన మనసును కలచివేస్తుంది. ఈ లఘు చిత్రానికి హిందీలో రాజ్ కుమార్ రావ్ .. ఆంగ్లంలో విద్యాబాలన్ .. తమిళంలో కమల్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, తెలుగులో నాని వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.