samantha: అలాంటి నీచులు అన్ని చోట్లా ఉన్నారు: క్యాస్టింగ్ కౌచ్ పై సమంత
- నా తొలి సినిమానే హిట్ అయింది
- అందుకే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం పెద్ద కష్టం కాలేదు
- నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదు
క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి వివాదం టాలీవుడ్ ను కుదిపేసింది. గత రెండు నెలలుగా ఈ స్థాయిలో రచ్చ అయిన వివాదం మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ పై అక్కినేనివారి కోడలు, హీరోయిన్ సమంత స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని... అన్ని రంగాల్లోనూ ఉందని తెలిపింది. అమ్మాయిల బలహీనతలను వాడుకునే నీచులు ప్రతి చోటా ఉన్నారని చెప్పింది.
తాను నటించిన తొలి సినిమానే హిట్ కావడంతో, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం తనకు రాలేదని సమంత తెలిపింది. గత ఎనిమిదేళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో తాను నటిస్తున్నప్పటికీ, తనకు అలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది. సినీ పరిశ్రమలో చెడు విషయాలు మాత్రమే కాకుండా, మంచి విషయాలు కూడా ఉన్నాయని తెలిపింది. తనకు ఒక అందమైన జీవితాన్ని ఈ పరిశ్రమ ఇచ్చిందని... అందుకే పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటించాలని తాను అనుకుంటున్నానని చెప్పింది.