sensex: బుల్ రంకె.. భారీ లాభాలతో వారాన్ని ప్రారంభించిన మార్కెట్లు
- లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 293 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 97 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతోపాటు, ఇన్వెస్టర్లు ఉత్సాహంగా కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మన స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి లాభాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ మరోసారి 35 వేల పాయింట్లను టచ్ చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 293 పాయింట్లు పెరిగి 35,208కి చేరుకుంది. నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 10,716కు ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (37.90%), గ్రీవ్స్ కాటన్ (8.01%), ఫైజర్ లిమిటెడ్ (7.76%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (6.46%), వెల్స్ పన్ కార్పొరేషన్ (6.41%).
టాప్ లూజర్స్:
వోక్ హార్డ్ లిమిటెడ్ (-7.82%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (-7.30%), ఉజ్జీవన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (-5.91%), స్ట్రైడ్స్ షాసూన్ లిమిటెడ్ (-4.78%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-4.19%).