hyperloop: అనంతపురం-అమరావతి-విశాఖ వరకు హైపర్ లూప్ రవాణా... గంటలోనే ప్రయాణం!
- మూడు దశల్లో ప్రాజెక్టు నిర్మాణం
- సాధ్యాసాధ్యాలపై ఆర్వీ అసోసియేట్స్ అధ్యయనం
- దీని వేగం గంటకు 1,200 కిలోమీటర్లు
హైపర్ లూప్ రవాణా వ్యవస్థ దేశంలోనే తొలిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాబోతోంది. అనంతపురం నుంచి అమరావతి మీదుగా విశాఖ వరకు దీన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీస్ ముందుకు వచ్చింది. 700-800 కిలోమీటర్ల ఈ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నది ప్రతిపాదన.
హైదరాబాద్ కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రాజక్టు సాధ్యాసాధ్యాలపై ఆర్వీ అసోసియేట్స్ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలనుకుంటున్నారు. మొదటి రెండు దశలు అమరావతి, విజయవాడ మధ్య ఏర్పాటయ్యేవి కాగా, మూడో దశలో అనంతపురం, అమరావతి, విశాఖపట్నం కవర్ అయ్యేలా ప్రాజెక్టు ఉంటుంది. హైపర్ లూప్ అన్నది గొట్టం మార్గంతో ఉంటుంది. ఇందులో వేగం గంటకు 1,200 కిలోమీటర్లు.