google tez: గూగుల్ తేజ్ ను అప్పుడే 1.6 కోట్ల మంది వాడేస్తున్నారు..!

  • ఆరు నెలల్లోనే చెప్పుకోతగ్గ సంఖ్యలో యూజర్లు
  • ఫీచర్ ఫోన్ల కోసం తీసుకురావడం లేదన్న గూగుల్
  • క్యాష్ బ్యాక్ ఆఫర్లతో యూజర్లను సొంతం చేసుకునే వ్యూహం

గూగుల్ తేజ్ యాప్ ను అప్పుడే 1.6 కోట్ల మంది వినియోగిస్తున్నారు. నెలవారీ 16 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు గూగుల్ ప్రకటించింది. స్మార్ ఫోన్లలో యూపీఐ ఆధారితంగా తేజ్ యాప్ పనిచేస్తుంది. అయితే, దీన్ని ఫీచర్ ఫోన్లలో ప్రవేశపెట్టే ఆలోచనేదీ లేదని గూగుల్ స్పష్టం చేసింది.

ఆరు నెలల క్రితం గూగుల్ తేజ్ యూప్ ను విడుదల చేసింది. తేజ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మొదటి లావాదేవీ నిర్వహించిన వారికి రూ.50 క్యాష్ బ్యాక్, అనంతరం రూ.500పైన లావాదేవీలపై స్క్రాచ్ కార్డులు, లక్కీ డీప్ ద్వారా క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తోంది. దీంతో లావాదేవీలు, యూజర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ప్రత్యర్థి వాట్సాప్ సైతం యూపీఐ ఆధారిత చెల్లింపులను తన యాప్ కు జోడించిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News