sensex: ట్రంప్ ప్రకటనతో నష్టాల్లోకి జారుకుని, చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు
- చివరకు 103 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
- 10,742 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో... ఈ ఉదయం మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 80 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత ఆటోమొబైల్, ఐటీ రంగాలు పుంజుకోవడంతో మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 103 పాయింట్లు పెరిగి 35,319కి పెరిగింది. నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 10,742 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ (12.19%), సింటెక్స్ ఇండస్ట్రీస్ (8.28%), మహీంద్రా హాలిడేస్ (6.28%, లిండే ఇండియా (6.23%), హెచ్సీఎల్ ఇన్ఫో సిస్టమ్ (5.44%).
టాప్ లూజర్స్:
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ (-4.14%), శారదా క్రాప్ కెమ్ లిమిటెడ్ (-3.77%), ఏజీస్ లాజిస్టిక్స్ (-3.57%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్(-3.54%), చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఫైనాన్స్ (-3.48%).