dhoni: తన తొలి ప్రేమ గురించి వివరించిన ధోనీ
- 12వ తరగతి చదివేటప్పుడు తొలిప్రేమ చిగురించింది
- ఆ ఏడేదే ఆమెను చివరిసారిగా చూశా
- ఆ తర్వత ఆమెను ఎప్పుడూ చూడలేదు
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనందరికీ ఈ ప్రేమ గురించే తెలుసు. అయితే తన జీవితంలో మరో ప్రేమకథ కూడా ఉందని తాజాగా ధోనీ తెలిపాడు. ఓ కార్యక్రమంలో తన తొలి ప్రేమ గురించి ధోనీ వివరించాడు.
ఆమె పేరులో 'ఏ' అక్షరం ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత అది పేరులోని మూడో అక్షరమని అన్నాడు. చివరకు ఆమె పేరు స్వాతి అని చెప్పేశాడు. ఈ విషయాన్ని తన భార్య సాక్షికి మాత్రం చెప్పవద్దని సరదాగా అన్నాడు. ఈ విషయంపై మరింత లోతుగా మాట్లాడుతూ, తాను 12వ తరగతి చదువుతున్నప్పుడు ఈ తొలిప్రేమ చిగురించిందని చెప్పాడు. ఆ ఏడాదే ఆమెను చివరిసారి చూశానని... ఆ తర్వాత ఆమెను ఎప్పుడూ చూడలేదని తెలిపాడు.